ఈ కృష్ణశుక్రవారము ఏమిటి, ఎప్పుడూ వినలేదనుకుంటున్నారా. ఇది అమెరికాలో జరుపుకునే పండగలెండి. కార్తీక మాసంలోని (అంటే నవంబర్ నెలలో) నాలుగవ గురువారం ఇక్కడ అమెరికన్‌లకి చాలా పెద్ద పండుగ. దానిని ధన్యవాదార్పిత దినము (Thanksgiving Day) అని అంటారు. ధన్యవాదార్పిత దినము తరువాత వచ్చే శుక్రవారమే కృష్ణశుక్రవారం (Black Friday). ఈ రోజు అమెరికాలోని అతి పెద్ద అమ్మకాలు జరిగే రోజు (ఇక్కడ "అమ్మకాలు" అన్నది ఒక్క పదమేనని గమనించవలెను). ఇంతకీ ఈ వ్రతం/పండగ ఎలా జరుపుకుంటారు అని అనుకుంటున్నారా? వివరిస్తాను, చిత్తగించండి.
ధన్యవాదార్పిత దినము ఒక్క అమెరికన్‌లు మాత్రమే జరుపుకున్నా, కృష్ణశుక్రవార వ్రతం మాత్రం, అమెరికాలో ఉండే అమెరికన్‌లు, అమెరికన్ ఇండియన్‌లు, ఇండియన్ అమెరికన్‌లు, మన దేశీ(యు)లు, తెల్లవారు, నల్లవారు, మగవారు, ఆడువారు, పిల్లలు, పెద్దలు అనే తరతమ బేధాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. ఈ వ్రతం జరుపుకోదలిచినవారు, ఆ రోజు పెందలకడనే లేచి, మంగళ స్నానాలు చేయకుండానే తమకిష్టమైన దుకాణ దర్శనమునకు బయలుదేరవలెను. దుకాణము తెరచు సమయమునకు (దుకాణములు బ్రహ్మ ముహూర్త సమయంకంటే ముందే తెల్లవారుఝామున 12 నుండి ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా తెరువవచ్చు) ఒక ఐదారు గంటల ముందునుండీ, దుకాణము ముందు చలిలో (సుమారు 30 డిగ్రీల ఫారెన్‌హైట్) క్యూ లోఒంటికాలిమీద నిలబడి లేదా కూచొని తపస్సు చేయవలెను. అమెరికా వచ్చుటకు రంభ, ఊర్వశులకు తావు (వీసా) లేదు కావున, భక్తుల తపస్సునకు ఎట్టి పరిస్థితులలోనూ భంగము వాటిల్లదు. దుకాణము తెరిచిన వెంటనే, వేటకాని విల్లంబు నుండి విడువడిన శరమువలె ఆ దుకాణములోనికి అతి వేగముగా జొరబడి, ఆ రోజు అతి తక్కువ ధరకు విక్రయింపబడు వస్తువులను, ఎవరికిష్టమైనవి వారు తమ తమ దుకాణపు బండ్లలో (shopping carts) వేసుకొని దుకాణదారునకు తగు పైకము చెల్లించి, సాధ్యమైనంత త్వరలో బయటపడి, వేరొక దుకాణమునకేగవలెను.
ఈ వ్రతమొనరించువారు తమ శక్తికొలది ధనముతోగాని, అరువు (క్రెడిట్‌కార్డు) తోగాని ఎన్ని దుకాణదర్శనములు చేసుకొని, ఎన్ని ఎక్కువ వస్తువులు కొన్న, అంత వ్రతఫలము దక్కును. సాధారణముగా మొగవారు ఈ వ్రతము బెస్ట్ బయ్ (BestBuy) అను ఎలెక్ట్రానిక్స్ దుకాణము ముందు తపస్సొనరించి, తమకు, తమ కుటుంబమునకు అ(న)వసరమగు అత్యాధునిక ఎలెక్ట్రానిక్ గృహోపకరణములను అత్యంత స్వల్పమైన ధరలకు పొంది(తిమని భ్రమించి) తరించెదరు. మహిళలు, పిల్లలు, టోయ్‌స్-ఆర్-అస్ (Toys-r-us) అను దుకాణ దర్శనమునకేగి, పిల్లల ఆటవస్తువులకై తపంబొనరించెదరు. బెస్ట్ బయ్ నందు వ్రతసిద్ధికై కొంతమంది భక్తులు గంటలకు బదులు రోజుల తరబడి తపంబొనరించిననూ ఫలసిద్ధి కలుగని సంఘటనలు కోకొల్లలు. మన దేశీయులు కూడా, మాసములో ఒక సారైననూ తెల్లవారుఝామున లేచి దేవాలయమునకు వెళ్ళుటకు బద్ధకించు భక్తులు కూడా, ప్రతి సంవత్సరమూ ఒక్కసారి ఈ వ్రతమొనరించుటకు మాత్రము సంకోచించరు.
నిన్న మేము ఈ వ్రతమొనరించి తరించిన వైనము: గురువారము రాత్రి సుమారు 10 గంటలకు మేమందరమూ మొదట టోయ్‌స్-ఆర్-అస్ దర్శనార్ధమేగి, అచ్చట దుకాణములోనికి హ్యారీ పాటర్ లోని "నాగినీ" సర్పము వలె మెల్లగా ఏతెంచుచున్న అరి భయంకరమైన భక్త జన సందోహమును చూచి కొంచము భయపడి, అతిగా నిరుత్సాహపడి వెనుదిరిగితిమి. దారిలో బెస్ట్‌బయ్ ముందు తపస్సు చేయు భక్తులను చూచి "అక్కటా! ఈ బెస్ట్ బయ్ ముందటి కృష్ణశుక్రవారపు భక్తులు, వైజాగ్ మూడో నెంబర్ ప్లాట్‌ఫారమ్ మీద తెల్లవారుఝామున చలిలో ఈస్ట్‌కోస్ట్ కై ఎదురుచూచు ప్రయాణీకులను తలపింపజేయుచుంటిరి కదా" అనుకొని వాల్-మార్ట్ (Wal-mart) ముఖముగా బయలుదేరితిమి. కృష్ణశుక్రవార వ్రత సిద్ధికై అత్యంత ప్రసిద్ధి పొందిన మరియొక దర్శినీయ స్థలము వాల్-మార్ట్ అను సామాన్య మానవుని దుకాణము. రెండు సంవత్సరముల క్రిందట కృష్ణశుక్రవారపర్వదినము నాడు, న్యూయార్క్ నగరమునందలి ఒక వాల్-మార్ట్ "ఉత్తర ద్వార దర్శనార్ధం" భక్తుల కోసం ద్వారము తెరచిన ఆ దుకాణపు ఉద్యోగస్థుడు, లోనికి ప్రవేశించు భక్తుల ధాటికి తట్టుకొనలేక, వారి పాదముల క్రింద పడి, అసువులు బాసి వెంటనే పరమపదించినాడు. అప్పటినుంచీ, వాల్-మార్ట్ దుకాణములు కొన్ని, వాటి ద్వారములు ముందటిరోజు రాత్రి నుంచి తెరిచియే ఉంచుచుంటిరి. ఇది నాలాంటి బయట చలిలో తపస్సు చేయలేని కొంతమంది భక్తులకు బహు ఆనందదాయకము. వాల్-మార్ట్ చేరిన వెంటనే, లోనికేగి, మాకు అవసరమగు వస్తువులు, ఆటవస్తువుల వద్ద ఒక్కొక్కరూ ఒక్కొక్క చోట వ్యూహాత్మకముగా నిలబడి, అర్ధరాత్రి 12 గంటలు కాగానే వాటిని గ్రహించి, స్వల్ప పైకము వెచ్చించి (<$100), అతి స్వల్ప వ్యవధిలో బయటపడి వ్రతసమాప్త మొనరించితిమి.
ఈ వ్రతము గురించి అంతర్జాలములో లభించు పలు ఉపకరణములు, కథలు వగైరా:
కృష్ణశుక్రవార వైశిష్ట్యము: http://en.wikipedia.org/wiki/Black_Friday_(shopping)
బహు విధములైన కృష్ణశుక్రవార వ్రతకల్పములు: http://bfads.net, http://blackfriday.com
వాల్-మార్ట్ నందు 2 సం.ల క్రితం జరిగిన దుర్ఘటన:
http://www.nytimes.com/2008/11/29/business/29walmart.html$
బెస్ట్‌బయ్‌ముందు నవరాత్రులు తపస్సు చేసిన భక్తుల కథ, వారికి లభించిన ఉచిత ఐ-ప్యాడ్లు.
http://news.holidash.com/2010/11/22/family-pitches-tent-at-best-buy-9-days-before-black-friday/
ఈ వ్రతమహాత్మ్యము యొక్క కథ చదివిన వారూ, విన్న వారూ, అందరూ తమ కుటుంబముతో మరు సంవత్సరం ఈ వ్రతము చేయుదునని ఈ బ్లాగు మూలముగా ప్రమాణము చేయవలెను.
మీరు కూడ, ఈ వ్రతమొనరించినయెడల, మీ అనుభవాలను ఇక్కడ పాఠకులతో పంచుకొనవచ్చును.
Sunday, November 28, 2010
Monday, November 1, 2010
బృందావనం - ఒక అరెవ్యూ
"దొంగలు పడ్డ ఆర్నెల్లకు..." అన్నట్లు, సినిమా రిలీజైన రెండు వారాలకి రెవ్యూ ఎందుకంటారా? ఎవడి తుత్తి వాడికానందం.
ముందుగా ఒక గమనిక/హెచ్చరిక - నా మూవీ రాతలు అరెవ్యూలు - అంటే రెవ్యూలు కానివి. ఎందుకంటే నేనెప్పుడూ రెవ్యూలు రాయలేదు/రాయను కాబట్టి.
రెండో గమనిక - పైన రాసిన డవిలాగు ఏ బ్లాగ్‌వుడ్ "తార"కి, బాలీవుడ్ తారకి సంబంధించింది కాదు. నా ఒరిజినల్.
ముచ్చటగా మూడో గమనిక - నా ఈ అరెవ్యూ, సినిమా చూసిన తర్వాత ఊరికే చదివి టైం వేస్ట్ చేసుకోడానికే తప్ప, సినిమా చూడడానికి ముందు ఒక కొలమానిగా ఉపయోగించొద్దని మనవి. ఇక అసలు కథలోకొద్దాం.
ఈ సినిమా చాలా బాగుంటుందనిన్నీ, గొప్ప కామేడీ అనిన్నీ, హింసలు ఫైట్లు అసలు లేవనిన్నీ, కుటుంబమంతా కలిసి హాయిగా చూడొచ్చనిన్నీ వగైరా వగైరా అసలు సిసలు రెవ్యూలు చదివీ, ఇంకా మరి కొందరు నా స్నేహితుల మాటలు వినీ, రెండవ వారమైనా కూడ ఇంకా ధర తగ్గించకుండా ($10) వేస్తున్నాడంటే చాలా బాగుండొచ్చనిన్నీ గొప్ప నమ్మకంతో నిన్న కుటుంబమంతా కలిసి వెళ్ళాం. ఇక సినిమా పై నా "అవిశ్లేషణ".
కథ - కథలో రెండు పల్లెటూర్లు. అందులో ఉండే జనాభా కంటే, లారీల్లో/టాటా సుమోల్లో కనిపించే గూండాలే ఎక్కువ. ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఇళ్ళు రెండూ, ధరణి ఆర్ట్ బీట్స్ చౌదరి గారు అమెరికాలోని బిల్‌గేట్స్ బిల్డింగ్ ని తీసుకొచ్చి, భీమడోలు బ్యాక్‌డ్రాప్‌లో ఫోటోషాప్‌లో పెడితే ఎలా ఉంటుందో అచ్చం అలా కనిపిస్తాయి. ఆ రెండు ఊర్లల్లో, వారి రెండు ఇళ్ళు తప్ప ఇంకెవరివీ ఆ చుట్టుపక్కల ఉండవ్. ముందరే చెప్పాగా. ఆ ఊరి జనాభా అంతా గూండాలనీ, వారు ఆర్టిసీ బస్సుల్లోను, సుమోల్లోను మాత్రం తిరుగుతూ కనిపిస్తారనీ.
పాటలు - పాటల గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. 33⅓ ఆర్.పి.ఎం. రికార్డు ని 45 ఆర్.పి.ఎం స్పీడ్‌లో తిప్పినట్లు అన్నీ పాటలు, ముఖ్యంగా డాన్సులు చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. నాకు మాత్రం ఒక్క పాట నచ్చింది - టైటిల్ సాంగ్. అంటే opening credits వేస్తున్నప్పుడు వచ్చిన పాట - NTR, జమున పాడిన "బృందావన మది అందరిదీ". అది కూడ (పాట కాదు అవిడియా) జంధ్యాల గారి "అహ నా పెళ్ళంట" నుంచి కాపీ కొట్టినట్లున్నారు. ప్లేబ్యాక్ సింగర్స్ ఒక పాతిక మంది వరకు ఉన్నారు. కాని ఏం లాభం. Too many cooks లాగ అయింది సంగీతం.
హింస/ఫైట్లు - ఈ సినిమా డైరెక్టరు చిరంజీవి ఫ్యాను అనుకుంటా. చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి రక్తం సప్లై చెయ్యడానికని కాబోలు, ఒక్క చుక్క కూడ క్రిందపడి వేస్ట్ అవకుండా జూ.ఎన్‌టీఆర్ తో ఫైట్లు చేయించాడు. ఆ ఫైట్లు కూడా అలాంటి ఇలాంటివి కావు. మన బాలయ్య "2012" సినిమాలో నటిస్తే ఎలాంటి ఫైట్లు పుడతాయో అలాంటివి. అంటే ఒక్కసారి పాదంతో గట్టిగా భూమి మీద (అంటే కాజల్ మీద కాదులెండి) కొడితే, భూమి కాకినాడ నుంచి కాలిఫోర్నియా వరకు రెండుగా చీలిపోయినట్లు, నోటితో గట్టిగా టోక్యోలో ఊదితే టోరంటోలో టోర్నెడో వచ్చిన్నట్లు, ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఒక సందర్భంలో అయితే, సౌండ్ పొల్యూషన్ అవకుండా, గూండాలందరూ 3-4 వరసల్లో నిలబడి ఉంటే, వెనక నుంచి ఒక్కొక్కణ్ణీ, ముందు వాడికి వినపడకుండా లేపేస్తాడు (literal గా గాల్లోకి, ఒక్క చేత్తో).
కామెడీ - సినిమాలో ఇంటర్వెల్ తర్వాత బ్రహ్మానందం వచ్చినా, సినిమా మొత్తం అంతా కామెడీనే. అర్ధం కాకపోతే, పైన రాసిన "హింస/ఫైట్లు" గురించి మరొక్కసారి చదువుకోండి. బ్రహ్మానందం, వేణుమాధవ్ లు ఉన్నా కామెడీ కోసం సరిగా ఉపయోగించుకోలేదు.
కొసమెరుపు - చివర్లో అన్నగారు కృష్ణుడి రూపంలో కనపడతారు. ఆఖరికి ఆయనకి మిమిక్రీ చేసిన వారి గొంతు కూడ ఆయన గొంతులా వినిపించదు. అంతకంటే మంచి మిమిక్రీ వాళ్ళని మన జెమిని, తేజ టీవీల్లో ఎంతోమందిని చూడొచ్చు.
జీవితంలో మొట్ట మొదిటిసారి నాకు సినిమా చూసింతర్వాత దానికి $32+3గంటలు వేస్ట్ అయ్యాయన్న భావన కలిగింది. ఇకపై సినిమాలు బ్లాగుల్లో ఎంత బాగున్నాయని రాసినా, డివిడి రెంట్ చేసి చూడ్డానికే నిర్ణయించుకొన్నా.
అరెవ్యూ ఇంతకంటే ఎక్కువ రాస్తే బాగుండదు.

Tuesday, August 10, 2010
కేటరాక్ట్
ఈ టపా టైటిల్ చూసి నేనేదో కేటరాక్ట్ గురించి సైఎన్స్-అసైఎన్స్ కబుర్లు చెపుతానని అపోహ పడకండి. అలాంటి వాటికి వేరే బ్లాగులున్నాయి. ఇది ఊరికే ఊసుపోకకి రాస్తున్న నా స్వానుభవం.(BTW, Science ని సై-ఎన్స్ అని పలకాలనీ, సైన్స్ (signs) లాగ కాదనీ , మా అబ్బాయి దగ్గర నేర్చుకున్నానులెండి. అదీ బడాయి).
క్రిందటి శుక్లవారం, సారీ, శుక్రవారం, నా ఎడమ కంటికి కేటరాక్ట్ సర్జరీ (శుక్ల శస్త్రచికిత్స అనొచ్చా) అయింది. అప్పటినుంచి నాకు శుక్లాచార్యుడన్న బిరుదు సమసిపోయింది. ఆ రోజంతా నేను కంటికి "డ్రెస్సింగ్"తో శుక్రాచార్యుడిలా ఉండవలిసి వచ్చిందనుకోండి - అది వేరే విషయం. [శుక్లాచార్యుడికి, శుక్రాచార్యుడికి ఒక ముఖ్యమైన తేడా. ఏమిటో తెలుసునా అది? శుక్లాచార్యుడికి "ద్విదృష్టి" (అంటే Double Vision) ఉంటుంది. శుక్రాచార్యుడికి ఉండేది దివ్యదృష్టి. కాని ఆయన ఆ దివ్యదృష్టి ఉపయోగించబట్టే, తర్వాత "ఏకదృష్టి" గా అయేడన్నది వేరే కథ.]
ఇంతకీ, నాకు కంట్లో శుక్లాలు ఎలా వచ్చేయో ఎందుకు వచ్చేయో కారణం యే డాక్టరూ చెప్పలేదు. ఇవి నాకు చిన్నప్పటినుంచీ రెండు కళ్ళల్లో ఉన్నాయి. "ఇవి సాధారణంగా వయసు మళ్ళిన వాళ్ళలో వస్తాయి. నువ్వు చూస్తే అలా కనిపించడం లేదు" అని చెప్పి తప్పించుకున్నవాళ్ళే అందరు డాక్టర్లూ. నేనింకా వయసు మళ్ళని వాడిననే దురభిప్రాయం నాకు పోలేదనుకోండి. కాని, మిగతా డాక్టర్ల మాట అటుంచి, వైజాగ్‌లో ఇంజనీరింగ్ అవగానే చూపించుకోడానికి వెళ్ళిన కంటి డాక్టరు కూడా నన్ను చూసి "నువ్వు చూస్తే అలా కనిపించడం లేదు" అనడం ఏమన్నా సబబుగా ఉంటుందా? మీరే చెప్పండి. అందుకే, ఆయనకి మళ్ళీ కనిపించకుండా వచ్చేసాను.
ఆ మధ్య "వికీ"లో చదువుతుంటే తెలిసింది - సుశృతుడు మొదటగా కేటరాక్ట్ సర్జరీ చేసేడనీ, గ్రీక్ నుంచి, చైనా నుంచి కూడా ఇండియాకి వచ్చి అది నేర్చుకునేవారని. ఈ విషయం నా డాక్టరుకి చెప్పి "చూసారా మా ఇండియన్స్ ఎంత గ్రేటో" అని కాలరెగరేద్దామనుకున్నానుగాని , సర్జరీ ముందర చెబితే, ఎక్కడ మనసులో కుళ్ళుకుంటూ, పైకి నవ్వుతూ "ఔనోయ్! మీ ఇండియన్స్ ఎంతైనా గొప్పోళ్ళే. నువ్ చెప్పిన సంగతి నేను కూడా వికీ లో చూసానులే. బై-ది-బై, మీ సుశృతుడు కేటరాక్ట్ సర్జరీ, పేషెంట్లకి ఎక్కడా ఎనస్తీషియా ఇచ్చి చేసిన దాఖలాలేం రాయలేదందులో. మరి నీకు కూడా అలాగే లాగించేద్దామా ఏమిటి. నేను సర్జరీ త్వరగా చేసేసి ఇంకో ఇద్దరు పేషెంట్లకి ఎటెండ్ అవొచ్చు, పనిలోపనిగా నువ్వు కొంచం డాలర్లు సేవ్ చెయ్యనూవచ్చు" అంటాడేమోనని భయపడి చెప్పలేదు. మొత్తానికి నొప్పెరక్కుండా బాగానే చేసాడులెండి. లెన్స్ ఇమ్‌ప్లాంట్ చెయ్యడం వలన ఇప్పుడు కళ్ళజోడు కూడా లేకుండ చూడగలుగుతున్నాను. రాను రాను, vision ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేడు. జాగ్రత్త కోసం, మూడు వారాల వరకు, రాత్రి పడుకునేటప్పుడు, కంటి మీద patch వేస్కొని పడుకోవాలని చెప్పేడు (పైరేట్ ఆఫ్ ద కర్రీ-బీన్ లాగ).
ఆలోచించి చూస్తే నాకు, కేటరాక్ట్ సర్జరీ చేయించుకోడం వలన కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడ "కనబడు"తున్నాయండోయ్. నష్టం ఏమిటంటే - Double Vision వలన, నాకు 2-డి సినిమాలన్నీ ఇంతకు మునుపు 3-డి లో కనబడుతుండేవి (అవతార్ 4-డి లో చూసింది బహుశా నేనొక్కడినే అయుండొచ్చు). ఇప్పుడా యోగం లేదు. ప్చ్! అతి ముఖ్యమైన లాభం ఏమిటంటే, ఇంతకుముందు మా ఆవిడ ఇద్దరుగా కనబడేది. ఇప్పుడేమో......అర్ధమయిందిగా - మా ఆవిడకి నేను సగమే భయపడొచ్చు.

Friday, July 2, 2010
తర్జుమాలో తప్పిపోయింది...
...అంటే అంటే అంటే....lost in translation అన్నమాట.
సుమారు మూడేళ్ళ క్రితం మేమంతా ఒకసారి ఇండియా వెళ్ళాం. ఒకరోజు అక్కడ ఒక చిన్న ఊర్లో ఉన్న మా బంధువులను చూడ్డానికి వెళ్ళాం. పరిచయాలన్నీ అయేక, మా బంధువు మా పెద్దబ్బాయిని (ఎనిమిదేళ్ళుంటాయి) "నువ్వు ఏం చదువుతున్నావు బాబూ" అని అడిగేరు. వెంటనే మా అబ్బాయి ఆ మాత్రం తెలీదా అన్నాట్టు సీరియస్‌గా "ఏమీలేదు" అని జవాబు చెప్పేడు. మా బంధువుకి కొంచం గ్లోబు గిఱ్ఱున ఆంధ్రా నుంచి అమెరికాకి రివర్సులో తిరిగినట్టనిపించి, "అమెరికాలో పుట్టినప్పటినుంచి పిల్లలందరూ ఇంగ్లీషు మాట్లాడతారు కదా అందుకని వాళ్ళని స్కూల్‌కి అస్సలు పంపనక్కర్లేదా ఏమిటి" అన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి నావైపు చూసేరు.
నాకు విషయం అర్ధమై మా బంధువుతో, "ఆ ప్రశ్నని ఇంగ్లీషులో What grade are you in? అంటే 'నువ్వే తరగతిలో ఉన్నావు?' అని అడగాల"ని చెప్పేను. మా అబ్బాయితో "ఆయనడిగిన ప్రశ్న What (book) are you reading? అని కాదు, తెలుగులో 'ఏ గ్రేడ్‌లో ఉన్నావు?' అనడానికి అలాగే అడుగుతారు" అని వివరించి చెప్పేను. ఇలాంటి "తర్జుమాలో తమాషాలు" నాలాంటి చాలామంది ప్రవాసాంధ్ర పిల్లల తల్లితండ్రులకు అప్పుడప్పుడు ఎదురవుతాయనే అనుకుంటాను.
మా అబ్బాయిలకి ఇప్పటికీ "మేము, మనము" ల మధ్య తేడా తెలీదు. నేను ఎప్పుడైనా వాళ్ళని "ఈ రోజు స్కూల్లో ఏం చేసేర్రా" అని అడిగితే, "మనం రీసెస్ లో టీచర్‌తో ఆడుకున్నాం, తర్వాత మనమందరం లంచ్ తిన్నాం, మన టీం ఈ రోజు గెలిచింది", వగైరా, వగైరా స్కూల్ పనులన్నిటిలో నన్ను కూడా కలిపి నాచేత కూడా చేయించేస్తారు.
ఒకసారి మా అబ్బాయిలిద్దరూ మా తమ్ముడితో ఏదో ఆట ఆడుతుంటే, మా చిన్నబ్బాయి "చిన్నాన్నా, నువ్వెళ్ళు" అన్నాడుట. మా తమ్ముడు, తనకి ఆఫీస్ కి ఆలస్యం అవుతోంది కదా, అందుకు వెళ్ళమంటున్నాడనుకొని ఆట మధ్యలో వదిలేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడుట. తర్వాత, మా అబ్బాయిలిద్దరూ ఒకటే గొడవ "చిన్నాన్న ఆట మధ్యలో ఆపేసి సడెన్‌గా వెళ్ళిపోయాడ"ని. చివరికి తేలిందేమిటంటే, ఏదైనా ఆట ఆడుతుంటే, తర్వాతి వారిని "నువ్వు ఆడాలి/నీ టర్న్" అనడానికి "You go" అని అంటూ ఆడుకుంటారు మా అబ్బాయిలు. అదన్నమాట సంగతి. విషయం అర్ధమై ఆ సాయంత్రం, మా తమ్ముడు నవ్వులే నవ్వులు.
ఏడవతరగతిలో ఉన్నప్పుడు, నాకు తెలుగు సబ్జెక్ట్‌లో ప్రతిపదార్ధం అంటే తెలిసేదికాదు. పరీక్షలో ఒకసారి ఒక పద్యానికి ప్రతిపదార్ధం వ్రాయమంటే, నేను తాత్పర్యం రాసేను. తెలుగు మాస్టారు చక్కగా సున్న మార్కులు వేసేరు. "తాత్పర్యం అంతా కరెక్ట్‌గా రాసేను కదా మార్కులెందుకు వెయ్యలేదు" అని దబాయించి అడిగితే, రెండు మొట్టికాయలేసి, అప్పుడు చెప్పేరు ప్రతిపదార్ధానికి, తాత్పర్యానికి తేడా. ఇప్పుడు, మా అబ్బాయిలు ప్రతి విషయాన్నీ తెలుగులోకి అర్ధం అనువదించి చెప్పకుండా, ప్రతిపదార్ధాన్ని మాట్లాడతారన్నమాట. ఉదాహరణలు: "నాన్నా, నేనొక హెయిర్‌కట్ తెచ్చుకోవచ్చా సన్‌డే మీద?" (Can I get a haircut on Sunday?); "అమ్మా, నా బర్త్‌డేమీద మనంకి ఒక వీడియో గేం కొంటావా?". ఇలాగే, కొన్ని కొన్ని వాక్యాల్ని "ఇది నీకు తెలుసా" అని మొదలుపెడతారు (ఇంగ్లీషులో "Do you know this, I have ..." అని మొదలుపెట్టినట్లు.
ఇలాంటివి కోకొల్లలు. మీకు కూడా ఇలాంటి తమాషాలు ఎప్పుడైనా ఎదురయ్యేయా?
కొసమెరుపు: అమెరికాకి వచ్చిన కొత్తలో మా శ్రీమతి ఒకసారి ఎపార్ట్‌మెంట్ క్లీన్ చెయ్యడానికి మెయింటెనెన్‌స్ వాడొస్తే, బూజులు దులపమని చెప్పడానికి ఏమనాలో తెలీక "క్లీన్ ఆల్ ద స్పైడర్స్ నెస్ట్" అందిట. వాడికి చాలాసేపు అర్ధం కాక జుట్టుపీక్కొన్నాడు. "సాలె గూడు" అనడానికి వచ్చిన తిప్పలవి. ఇంకా నయం. "సాలె మనిషి" ఈ మాటలు వినలేదు. విని ఉంటే, తన "స్పైడర్స్ నెస్ట్" నుంచి ఒక సాలె దారం తీసి ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు.
ఇక సెలవు,
కేకే

Thursday, June 17, 2010
మీరీ పాటలు ఎప్పుడైనా విన్నారా?
మా తమ్ముడు చిన్నప్పుడు తన సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) లోని ప్రశ్న ఒకటి "గ్రామ మునసబు పని ఏమి" అనేది "గ్రామమున సబ్బు పని ఏమి" అని చదివేవాడు. మేము వెంటనే "బట్టలు ఉతుకుట, ఒళ్ళు రుద్దుట, వీపు తోముట" అని జవాబిచ్చేవాళ్ళం.
అదలా ఉంచితే, ఈ బ్లాగుకి "మీరీపాటలు విన్నారా?" అనేకన్నా "మీరీపాటలు ఇలా (అంటే నేను వినినట్లు) విన్నారా?" అని ఉండాలి. చిన్నప్పుడు, మధ్య ప్రదేశ్ లో ఉండడం వలన, హిందీ పాటలు ఎక్కువ వినేవాడిని (కాదు, వినబడేవి). ఇంట్లో తెలుగు, బాహర్ హిందీ వలన, సగం హిందీ అర్ధమయ్యేది, చాలామటుకు అర్ధమయ్యేది కాదు. చదివింది ఆంధ్రాలో అయినా, సెలవులకెప్పుడూ, మ.ప్ర.కేళ్ళేవాడిని. అర్ధం కాకపోయినా, గొడవపెట్టి మరీ హిందీ సినిమాలు చూసేవాడిని.
ఆ టైంలో, ముకద్దర్ కా సికందర్ విడుదలై, పెద్ద హిట్ అయింది. రోడ్ మీద ఎక్కడ చూసినా, అందరూ దాని పాటలు పాడుతూ కనబడేవాళ్ళు. మనమేం తక్కువ తిన్నామా. అందులోని "ఓ సాథీరే" పాట "తేరే భీ నాభి క్యా జీనా" అని పాడేవాడ్ని. ఎందుకంటే, నాకు అలానే వినబడేది కాబట్టి. కాని నాకెప్పుడు ఆ పాట అర్ధమయ్యేది కాదు - హీరో, తన ఫ్రెండ్ బొడ్డు గురించి ఎందుకు బాధ పడుతున్నాడో.
తర్వాత కొన్నాళ్ళకి కుర్బానిలొ నాజియా హసన్ పాటలు బాగా పాప్యులర్ అయ్యేయి. సినిమా ఇప్పటికీ చూడలేదనుకొండి, కాని అందులో పాట "ఆప్ జైసా కోయి, మేరీ జిందగీ మే ఆయే, తో బాత్ బన్‌జాయే", నాకు "తో బాప్ బన్‌జాయే" అని వినబడేది. "ఆ అమ్మాయి జీవితంలోకి ఎవరైనా వెళ్తే, వాళ్ళు వెంటనే తండ్రి అయిపోతారేమో అనుకునేవాడిని".
అలాగే, తెలుగులో భలే తమ్ముడు చూసాను. దాని హిందీ పాట "బార్ బార్ దేఖో" సిలోన్ రేడియోలో తరుచూ వచ్చేది. అది ఎలా అర్ధమయేదంటే, "Bar Bar తిరిగి చూసాను. వెయ్యి Barలు చూసాను. ఏ Bar చూసినా మంచి వస్తువేమి కనిపించలేదు" అని హీరో పాడుతున్నాడనుకునేవాడిని(భలే తమ్ముడులో NTR ఆ పాట ఒక Bar లో పాడతాడు అని తెలుసు) - ఏ Bar చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త Barలు బీరాయణతత్వం లాగ.
హిందీయే కాదండోయ్, తెలుగు పాటలు కూడా కొన్ని సరిగా అర్ధమయేవి/వినిపించేవి కావు. కోడెనాగులో అనుకుంటా పాట "కధ విందువా" అని. అందులో ఒక తల్లి పిల్లలతో, "బయట బాగా వర్షం పడుతోంది, మంచి భోజనం పెడుతూ, ఒక కథ చెపుతాను" అని పాడుతుందనుకునేవాడిని. ఎందుకంటే, ఆ పాట నాకు "కథ, విందు, వానా - కథ, విందు, వానా" అని వినబడేది మరి (కట్టె, కొట్టె, తెచ్చె టైప్‌లో).
ఇంక ఆఖరిగా, ఆరాధనలో రఫీ పాట "నా మది నిన్ను". ఆ పాటలోని ఒక చరణంలో "తలపులలోనే నిలిచేవు నీవే" అని వస్తుంది. తలుపులలో ఎవరైనా ఎలా నిలబడగలరబ్బా అని ఈ చిన్నిబుర్రకి ఎంతకీ తట్టేదికాదు.
మా పిల్లలిద్దరు అమెరికాలో పుట్టి పెరుగుతున్నారు. మరి వాళ్ళు హింది, తెలుగు సినిమాలు చూస్తూ, పాటలు వింటుంటే, వాళ్ళకెలా అర్ధమవుతుంటాయో మరి. వాళ్ళు పెద్దయేక అడిగి ఇలాంటిదే ఒక బ్లాగు రాయాలి.
ఇక వుంటా,

Wednesday, June 16, 2010
శ్రీసుగన్‌ధ్ బ్లాగు
బ్లాగు చదివే మిత్రులందరికీ నమస్తే
నేను కూడా బ్లాగడం మొదలెట్టాసానోచ్ (మీ అందరి తలకాయలు తినడానికి). ఇప్పటివరకు, నేను "హార్లిక్స్ తాగను, తింటాను" టైపులో, "బ్లాగులు రాయను, చదువుతాను" అని ఉన్నానన్నమాట. చదవడమే కాకుండా, ఎప్పుడైనా కామెంటుతుంటాను కూడా. అలా అని నేనేదో ఇక ప్రతిరోజూ రాసి ఊడ బొడిచేస్తాననుకున్నారేమో (హమ్మయ్య అనుకుంటున్నారా?). భయపడకండి. ఏదో అప్పుడప్పుడు అలా అలా టైం ఉన్నప్పుడు మాత్రం బ్లాగుతాన్లెండి.
ప్రస్తుతానికి ఇక ఉంటా. బై. మరీ అంత మొహమాటం లేకుండా వెళ్ళిపోకండి. కొంచం గుడ్‌లక్ చెప్పి వెళ్ళండి.
ఇట్లు,

Subscribe to:
Posts (Atom)