"దొంగలు పడ్డ ఆర్నెల్లకు..." అన్నట్లు, సినిమా రిలీజైన రెండు వారాలకి రెవ్యూ ఎందుకంటారా? ఎవడి తుత్తి వాడికానందం.
ముందుగా ఒక గమనిక/హెచ్చరిక - నా మూవీ రాతలు అరెవ్యూలు - అంటే రెవ్యూలు కానివి. ఎందుకంటే నేనెప్పుడూ రెవ్యూలు రాయలేదు/రాయను కాబట్టి.
రెండో గమనిక - పైన రాసిన డవిలాగు ఏ బ్లాగ్‌వుడ్ "తార"కి, బాలీవుడ్ తారకి సంబంధించింది కాదు. నా ఒరిజినల్.
ముచ్చటగా మూడో గమనిక - నా ఈ అరెవ్యూ, సినిమా చూసిన తర్వాత ఊరికే చదివి టైం వేస్ట్ చేసుకోడానికే తప్ప, సినిమా చూడడానికి ముందు ఒక కొలమానిగా ఉపయోగించొద్దని మనవి. ఇక అసలు కథలోకొద్దాం.
ఈ సినిమా చాలా బాగుంటుందనిన్నీ, గొప్ప కామేడీ అనిన్నీ, హింసలు ఫైట్లు అసలు లేవనిన్నీ, కుటుంబమంతా కలిసి హాయిగా చూడొచ్చనిన్నీ వగైరా వగైరా అసలు సిసలు రెవ్యూలు చదివీ, ఇంకా మరి కొందరు నా స్నేహితుల మాటలు వినీ, రెండవ వారమైనా కూడ ఇంకా ధర తగ్గించకుండా ($10) వేస్తున్నాడంటే చాలా బాగుండొచ్చనిన్నీ గొప్ప నమ్మకంతో నిన్న కుటుంబమంతా కలిసి వెళ్ళాం. ఇక సినిమా పై నా "అవిశ్లేషణ".
కథ - కథలో రెండు పల్లెటూర్లు. అందులో ఉండే జనాభా కంటే, లారీల్లో/టాటా సుమోల్లో కనిపించే గూండాలే ఎక్కువ. ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఇళ్ళు రెండూ, ధరణి ఆర్ట్ బీట్స్ చౌదరి గారు అమెరికాలోని బిల్‌గేట్స్ బిల్డింగ్ ని తీసుకొచ్చి, భీమడోలు బ్యాక్‌డ్రాప్‌లో ఫోటోషాప్‌లో పెడితే ఎలా ఉంటుందో అచ్చం అలా కనిపిస్తాయి. ఆ రెండు ఊర్లల్లో, వారి రెండు ఇళ్ళు తప్ప ఇంకెవరివీ ఆ చుట్టుపక్కల ఉండవ్. ముందరే చెప్పాగా. ఆ ఊరి జనాభా అంతా గూండాలనీ, వారు ఆర్టిసీ బస్సుల్లోను, సుమోల్లోను మాత్రం తిరుగుతూ కనిపిస్తారనీ.
పాటలు - పాటల గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. 33⅓ ఆర్.పి.ఎం. రికార్డు ని 45 ఆర్.పి.ఎం స్పీడ్‌లో తిప్పినట్లు అన్నీ పాటలు, ముఖ్యంగా డాన్సులు చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. నాకు మాత్రం ఒక్క పాట నచ్చింది - టైటిల్ సాంగ్. అంటే opening credits వేస్తున్నప్పుడు వచ్చిన పాట - NTR, జమున పాడిన "బృందావన మది అందరిదీ". అది కూడ (పాట కాదు అవిడియా) జంధ్యాల గారి "అహ నా పెళ్ళంట" నుంచి కాపీ కొట్టినట్లున్నారు. ప్లేబ్యాక్ సింగర్స్ ఒక పాతిక మంది వరకు ఉన్నారు. కాని ఏం లాభం. Too many cooks లాగ అయింది సంగీతం.
హింస/ఫైట్లు - ఈ సినిమా డైరెక్టరు చిరంజీవి ఫ్యాను అనుకుంటా. చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి రక్తం సప్లై చెయ్యడానికని కాబోలు, ఒక్క చుక్క కూడ క్రిందపడి వేస్ట్ అవకుండా జూ.ఎన్‌టీఆర్ తో ఫైట్లు చేయించాడు. ఆ ఫైట్లు కూడా అలాంటి ఇలాంటివి కావు. మన బాలయ్య "2012" సినిమాలో నటిస్తే ఎలాంటి ఫైట్లు పుడతాయో అలాంటివి. అంటే ఒక్కసారి పాదంతో గట్టిగా భూమి మీద (అంటే కాజల్ మీద కాదులెండి) కొడితే, భూమి కాకినాడ నుంచి కాలిఫోర్నియా వరకు రెండుగా చీలిపోయినట్లు, నోటితో గట్టిగా టోక్యోలో ఊదితే టోరంటోలో టోర్నెడో వచ్చిన్నట్లు, ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఒక సందర్భంలో అయితే, సౌండ్ పొల్యూషన్ అవకుండా, గూండాలందరూ 3-4 వరసల్లో నిలబడి ఉంటే, వెనక నుంచి ఒక్కొక్కణ్ణీ, ముందు వాడికి వినపడకుండా లేపేస్తాడు (literal గా గాల్లోకి, ఒక్క చేత్తో).
కామెడీ - సినిమాలో ఇంటర్వెల్ తర్వాత బ్రహ్మానందం వచ్చినా, సినిమా మొత్తం అంతా కామెడీనే. అర్ధం కాకపోతే, పైన రాసిన "హింస/ఫైట్లు" గురించి మరొక్కసారి చదువుకోండి. బ్రహ్మానందం, వేణుమాధవ్ లు ఉన్నా కామెడీ కోసం సరిగా ఉపయోగించుకోలేదు.
కొసమెరుపు - చివర్లో అన్నగారు కృష్ణుడి రూపంలో కనపడతారు. ఆఖరికి ఆయనకి మిమిక్రీ చేసిన వారి గొంతు కూడ ఆయన గొంతులా వినిపించదు. అంతకంటే మంచి మిమిక్రీ వాళ్ళని మన జెమిని, తేజ టీవీల్లో ఎంతోమందిని చూడొచ్చు.
జీవితంలో మొట్ట మొదిటిసారి నాకు సినిమా చూసింతర్వాత దానికి $32+3గంటలు వేస్ట్ అయ్యాయన్న భావన కలిగింది. ఇకపై సినిమాలు బ్లాగుల్లో ఎంత బాగున్నాయని రాసినా, డివిడి రెంట్ చేసి చూడ్డానికే నిర్ణయించుకొన్నా.
అరెవ్యూ ఇంతకంటే ఎక్కువ రాస్తే బాగుండదు.
డబ్బులు ($32+3గంటలు వేస్ట్) పొయిన తరువాత ఎడ్చి ఎమి లాభం లేదు!. ఇంకొక సారికూడా ఇలాంటి (Reviews చదివి సినిమా చూడడం) పొరపాటు చెయకపొతె మంచిదే! :)
ReplyDeletevery nice "అరెవ్యూ"..!!నేనూ ఈ మధ్యనే బావుంటుందేమో ఆశపడి చూసి (కొత్త తెలుగు సినిమా దుస్థితికి)బాధపడి, నా ఆత్యాశకు)దు:ఖించి, (ప్రేక్షకజనాలపై)జాలిపడి (ఆలోచించించటం కూడా వృధా అనుకుని)వదిలేసానండీ...:)
ReplyDeleteఇంతమందికి నచ్చింది నాకొక్కడికే ఎందుకు నచ్చలేదు ? whats wrong with me అని ఇన్ని రోజులు మధనపడుతున్నా, మొత్తానికి మీ అరివ్యూతో నన్ను బ్రతికించారు. ఈ సినిమా మొత్తం మీద నేను బాగా ఎంజాయ్ చేసినది రంగులద్దిన "బృందావనమది" పాట ఒక్కటే.
ReplyDelete:):):)
ReplyDeleteAnonymous గారూ, డబ్బులు పోయాయి కాబట్టే ఏడుపు - లాభం ఉండదని తెలిసీ. అదీ first time ఇలా జరిగింది కాబట్టి, బ్లాగ్ముఖంగా ఇలా ఏడవడం.
ReplyDeleteవేణూ శ్రీకాంత్ గారూ, nothing is wrong with you. ఇక నుంచీ ఈ బ్లాగ్ రెవ్యూ మాయలో పడకుండా కొంచం wait చేసి అప్పుడు చూస్తే ఇలా మోసపోడానికి తావుండదు.
Anonymous, తృష్ణ , వేణూ శ్రీకాంత్, 3g లకు ధన్యవాదాలు - కామెంటినందుకు.
mee areview keekaa..
ReplyDeletetaara :))
థాంక్స్ తారగారూ, మీ ఐడియానే కాపీ కొట్టేసా:-)
ReplyDeleteహ హ హ అరెవ్యూ...బావుంది.
ReplyDeleteఇలా ఏడవాల్సి వస్తుందేమోననే నేనే సాహసాలు చెయ్యలేదు. గత సినిమాలు చూసిన, రివ్యూలు చదివిన అనుభవం నన్ను కాపాడింది.
ఆ.సౌమ్య గారూ, నేను కూడా చాలామటుకు మూడు బ్లాగులు-ఆరు రివ్యూలు చదివిన తర్వాత కాని క్రొత్త మూవీ చూసే సాహసం చెయ్యను. కాని మొదటిసారిగా మోసపోయాను.
ReplyDeleteకేకే గారూ.. పోస్ట్ కేకంతే
ReplyDeleteమరిన్ని అరివ్యూల కోసం వెయిటింగ్
ఇప్పుడు మేము రాసిన వ్యాఖ్యలన్నీ అవాఖ్యలా?
హహహ, హరే,
ReplyDeleteఅరివ్యూ, అవ్యాఖ్యలు, రివ్యూ అదుర్స్..
నాకో సారి మెయిల్ చెయ్యగలరా నా ఐడి (taara.blog@gmail.com)
హరే కృష్ణ గారూ, థాంక్సండీ. నేనెప్పుడూ "సినిమాలు చూస్తాను, రెవ్యూలు రాయను" బాపతు. కాని ఈ సినిమాకెందుకో ($32 వేస్ట్ అయ్యాయన్న కసితోనేమో) రాయాలనిపించి, నా అక్కసునంతా వెళ్ళగక్కేను. అంతే తప్ప ఇది నా హాబీ గా మార్చుకొని, ప్రతి హీరో ఫ్యాన్స్ చేత బ్లాగ్బహిష్కార శిక్ష పొందదలుచుకోవాలన్న ఆశతో కాదండీ. ఇక పోతే, మీరు రాసినవి అవ్యాఖ్యలని నేననను. ఎందుకంటే, ఈ "అ" prefix తన కాపీరైటంటూ, మన బ్లాగ్‌వుడ్ తారగారు మిమ్మల్ని, నన్ను కలిపి sue చేసేటట్లున్నారు. అందుకే, మిమ్మల్ని ఈ-మెయిల్ చేయమంటునట్లున్నారు. దానికి ముందు జవాబివ్వండి.
ReplyDeletekk sir, I asked you to mail me, I couldn't find your mail id in your profile, thats why put my request here.
ReplyDelete