కొరోనా వ్యాపిస్తున్న కొత్తలో, దానికి కోవిడ్19 అని పేరు పెట్టకముందు, ప్రెసిడెంట్ ట్రంప్ అనుకుంటా, కొరోనాని "చైనా వైరస్" అని పిలవాలని అన్నాడు. అందుకు కొంతమంది ప్రతి"పక్షులు" అభ్యంతరం చెప్పారు - అలా పిలవటం వలన, USA లో ఉంటున్న చైనావారిని అవమానపరిచినట్టు అవుతుందని వారి వాదన.
అదలా పక్కన పెడితే, క్రిందటి వారం, మా వాట్సాప్ గ్రూప్‌లో, మా ఫ్రెండొకడు, ఇదే విషయం మీద చర్చ లేవదీసాడు - కొరోనాని "చైనా వైరస్" అని ఎందుకు పిలవకూడదు అని. దానికి ఉదాహరణగా, ఇండియాలో ఎప్పుడో వచ్చిన కళ్ళ కలక (conjunctivitis, Pink Eye) గురించి చెపుతూ, దానిని Madras eye అని పిలిచేరు కదా. అప్పుడు మేమేమైనా అనుకున్నామా అని సమర్ధించుకున్నాడు (అతనిది చెన్నై లెండి).
అతనన్నదానికి నేను స్పందిస్తూ, అప్పుడు మీరేమన్నా అనుకున్నారో లేదో గాని, ఇప్పుడు Madras eye అంటే మాత్రం డి.ఎం.కే, ఏ.ఐ.ఏ.డి.ఎం.కే లాంటి రాజకీయ పార్టీలు మాత్రం అభ్యంతరం లేవదీస్తాయి అన్నాను. ఎందుకంటే, ఇప్పుడది మద్రాస్ కాదు. అంచేత, Pink Eye ని ఇప్పుడు Chenn-Eye అని పేరు మార్చాలని చెప్పేను. అంతేకాకుండా, ఇండియాలో అన్ని ప్రాంతీయ, రాష్ట్రీయ, వగైరా వగైరా వాదులని తృప్తి పరిచే విధంగా, Pink Eye ని పిలవాలని సూచించేను. అంటే, నార్త్ ఇండియన్‌కి ఎవరికైనా కళ్ళ కలక వస్తే అది vaDa Chenn-Eye (తమిళంలో వడ అంటే ఉత్తరం అని అర్థం). బాంబే లో వస్తే, అది Mumb-Eye లేదా navi Mumb-Eye. మదురై లో ఎవరికైనా వస్తే Madur-Eye. కోయంబత్తూర్లో వస్తే Kov-Eye. మళయాళీకి వస్తే piLL-Eye. చెన్నైలో, కొత్తగా పెళ్ళి చేసుకున్న అల్లుడికి వస్తే maappiLL-Eye. తమిళ అయ్యంగారికి వస్తే అది vaDakaL-Eye లేదా thenkal-Eye (అయ్యంగార్లకి కొంచం మడి ఎక్కువ, మిగతా వారితో అంత త్వరగా కలవరు కదా). ఇక అంతర్జాతీయంగా కూడా, దీన్ని వర్గీకరించొచ్చు. దుబాయ్‌లో ఉన్న ఇండియన్స్‌కి వస్తే అది Dub-Eye. చైనాలో వస్తే Shangh-Eye. విషయం అందరికీ అర్థమైందనుకుంటాను.
ఇక కొరోనా విషయానికి వస్తే, Pink Eye ని Madras Eye అన్నారుకాని India Eye అనలేదు కదా, మరి కొరోనాని China Virus అని ఎందుకు పిలవాలని మరో అభ్యంతరం లేవదీసాను. అప్పుడు మా మిత్రుడు, "అయితే, అది Wuhanలో పుట్టింది కాబట్టి, Wuhan Virus అని పిలుచుకో" అన్నాడు.
చివరిగా నా ఆఖరి అనుమానాన్ని వ్యక్తపరిచేను. conjunctivitis కళ్ళకి వస్తుంది కాబట్టి, దాన్ని Madras Eye అన్నారు (అది కూడా ఒక రకమైన వైరస్సే). కొరోనా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది కదా, మరి Madras Eye లాజిక్ ప్రకారం, కొరోనాకి Wuhan Lungs అన్న పేరు సరి అయింది కదా అని అడిగేను. ఇప్పటివరకు మా ఫ్రెండ్ నుంచి జవాబు లేదు. :-)
మరి మీరేమంటారు? చైనా వైరస్సా? వూహాన్ లంగ్సా? మరొకటా?
P.S. ఈ బ్లాగ్‌కి "నీ పేరేంటో చెప్పు బేబీ?" అని పేరు పెట్టాను. మీరు నాలాగ కొంచం పాత (అంటే ఘంటసాల) తరం వారు కాకుండా, DSP తరం వారైతే , దీన్ని "What అమ్మా, What's Your Name అమ్మా?" అని మార్చి చదువుకొండి.
P.P.S. ఇది ఊరికే సరదాకి రాసింది. ఏ వాదాన్ని, తత్వాన్ని అడ్డం పెట్టుకొని కామెంట్లు చేయకండి ప్లీజ్.

ఏందీ సామి ఇది , అందరు పదేసి సంవత్సరాల తరువాత బయటకి వస్తున్నారు , ఓసి నీ పాసు కూల , ప్రపంచం అంతం అయిపోయే అంత గడబిడ జరిగితే గాని బ్లాగ్ రాయరా ఏందీ ? లేకా ఎవరైనా మిమ్మల్ని వనవాసానికి పంపించారా ? రాయండబ్బా , రాస్తే పోయేది ఏముంది ఒక గంట టైం తప్ప , కానీ చదివే వాళ్ళు దాన్ని నెమరేసుకుంటూనే ఉంటారు .
ReplyDeleteఅయ్యా ఎనానిమస్సు గారూ,
Deleteమీరెవరో గాని, ముఖానికి వేసుకున్న మాస్క్ తీసేసి, మీ ముఖారవిందం చూపిస్తూ కొంచం తిట్టొచ్చుగదా? కొరోనా గురించి బ్లాగు చదివి కామెంట్ పెట్టినాకూడా మాస్క్ వేస్కొని చెయ్యాలని మీకెవరైనా వాట్సాప్‌లో పంపారా ఏమిటి?
బ్లాగులు మళ్ళీ రాయకపోటానికి చాల కారణాలున్నాయండీ. ఇప్పుడేదో కొంచం టైము, టాపిక్కు దొరింకింది కాదా అని మళ్ళా రాసేను.
Haha.. good one. Keep posting :)
ReplyDelete